Home » Rains
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు (25వ తేదీ వరకు) పలు రైళ్లు రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్(Waltheru Division Senior DCM K. Sandeep) తెలిపారు.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌కు చేరువగా సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడి తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 9 ఓడరేవుల్లో ఒకటో నెంబర్ సూచిక ఎగురవేశారు.
చీకటి పడ్డ తరువాత దంచికొట్టిన వాన.. తెల్లవారేలోగా కాలనీలను ముంచెత్తింది. అనంతపురంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతానికి తోడు.. కనగానపల్లి చెరువు తెగిపోవడం, ఆ మండలంలో కురిసిన దాదాపు 20 సెంటీమీటర్ల కుండపోత పండమేరుకు చేరడంతో జనం బెంబేలెత్తిపోయారు. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి పరిధిలోని జగనన్న కాలనీ, గురుదాస్ కాలనీ, ఆటోనగర్ ...
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుపానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఈ క్రమంలో ఏ ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఉందనేది ఇక్కడ చుద్దాం.
అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వాన దెబ్బకు పలు మండలాల్లో రైతులు ఆరబెట్టిన పంటలు తడిసిముద్దయ్యాయి.
నగరంలో, శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం ఆగి మూడు రోజులు దాటినా శివారు ప్రాంతాల్లోని వారంతా ఇంకా జలదిగ్బంధంలో ఉన్నారు. కార్పొరేషన్ అధికారుల సమాచారం మేరకు శివారు ప్రాంతాల్లో సుమారు 500 కుటుంబాలు వాననీటిలోనే కాపురం చేస్తున్నారు.
బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు నందికొట్కూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. సాగు చేసిన పంట చేతికందే వరకు కష్టంగా మారుతోంది. ఓవైపు చీడపురుగులు, రోగాలు మరోవైపు ప్రకృతి వైఫరీత్యాలు రైతన్నల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలిగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల కంట నీరు తెప్పిస్తున్నాయి. ఖరీ్‌ఫలో బోర్లు, వర్షాధారంగా సాగుచేసిన పంటలు కోతకు వచ్చాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో పండిన పంటను ఇంటికి తెచ్చుకోలేకపోతున్నారు. చేనులోనే పంటలు నీట మునుగుతున్నాయి. కోసిన పంటను నూర్పిడి చేసుకోలేక, ఆరబెట్టుకోలేక ...
తుఫాను ప్రభావం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా బెంగళూరు(Bengaluru) శివారు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ప్రత్యేకించి నగరంలో రెండోరోజు బుధవారం లక్షలాదిమందిని ఇబ్బంది కలిగించినట్టయ్యింది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన భారీవర్షాలకు రాజధాని నగరం చెన్నై(Chennai) ఇంకా నీటిలోనే నానుతోంది. రెండు రోజుల వర్షానికి నగరంలో 539 ప్రాంతాల్లో వరద నీరు నిలువగా, ఇందులో 436 ప్రాంతాల్లో జీసీసీ సిబ్బంది తొలగించారు.