Home » Rains
భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దంచికొడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.
మూడు రోజులపాటు ప్రజలను అవస్థలకు గురిచేసింది. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన స్థాయిలో తుఫాన్ తీవ్రత లేకున్నా నష్టాన్ని మాత్రం ఓ మాదిరిగా మిగిల్చింది. ఇలా జిల్లాలో మొంథా వల్ల కలిగిన నష్టం రూ.38.21 కోట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.
మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తింది. ఈ వరద ప్రవాహం గురువారం సాయంత్రానికి మరింత వచ్చి చేరుతుందని అధికారులు అంటున్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో నవంబరు 3వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటిందన్నారు.
వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మున్నేరు వాగు ఉధృతి పెరిగి పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. రహదారులు నీటమునిగిపోయి రవాణా అంతరాయం ఏర్పడింది.
ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్ ఆగొద్దు అని అధికారులకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు సూచించారు. మొంథా తుపాను ప్రభావంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. బుధవారం ఆయా సంస్థల కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్, ఏవీ రంగనాథ్ పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ తుఫాన్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్‌ను ఇక్కడ చూడండి.
మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.