Home » Rains
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
మొంథా తుఫాను దృష్ట్యా వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రా వేదికగా బుధవారం మొదలైన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయింది. కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో తుఫాన్‌ల సమయంలో పనిచేసిన అనుభవం తనకుందని గుర్తుచేశారు.
మొంథా తుఫాను దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మొంథా తుఫానుతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనాలు, ప్రస్తుతం ముంథా తుఫాన్ కారణంగా నగరంలో పక్షం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (32 గంటలపాటు) నగరం, శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
కోస్తాంధ్రపై మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో..
మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
‘మొంథా’ తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ఏడు తీర ప్రాంత జిల్లాలపై మొంథా తుఫాన్ పంజావిసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు, భారీవర్షాలతో బీభత్సం సృష్టించింది.