Home » Raja Singh
నగరంలోని అప్జల్‌గంజ్ పోలీసు స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) పై గురువారం నాడు కేసు నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహించారు. అయితే అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని పోలీసులు రాజాసింగ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగూడ వద్ద ర్యాలీని నిలిపి బాణాసంచా కాల్చారని పోలీసులు ఆరోపించారు.
Telangana: ‘‘కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు.
బీజేపీ నేత రాజాసింగ్(Rajasingh)ను తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు(గురువారం) చెంగిచెర్ల వెళ్తానని రాజాసింగ్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనకు.. రేవంత్ రెడ్డి పాలనకు పెద్దగా తేడా లేదని అన్నారు.
Telangana: ఎంపీగా పోటీపై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్తోందని... కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
Andhrapradesh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజాసింగ్‌కు కాల్ చేసి బెదిరింపులకు దిగిన వారిని ఖాకీలు గుర్తించారు. గత కొంతకాలం నుంచి రాజాసింగ్‌కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు.
హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రామనవమి శోభాయాత్ర చేస్తే.. చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపులు వచ్చాయి. దీనిపై స్పందించిన రాజాసింగ్... ‘ఫోన్లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని’ సవాళ్లు విసిరారు.
షోలాపూర్ లో జరిగిన హిందూ జన్ ఆక్రోష్ ర్యాలీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే, పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జైల్ రోడ్ స్టేషన్ అధికారులు తెలిపారు. రాజేంద్ర చౌక్, కన్నా చౌక్ మధ్య శనివారంనాడు హిందూ జన్ ఆక్రోష్ ర్యాలీ నిర్వహించారు.
Telangana: ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభయ హస్తం - ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ఏర్పాట్లపై ఆయన అభ్యంతరం తెలిపారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.