Home » Rajastan
దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్‌లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో యువ జంటలు బైకుల మీద చేస్తున్న నిర్వాకాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. నాలుగ్గోడల మధ్య జరగాల్సిన పనులు పబ్లిక్ గా చేస్తూ సోషల్ మీడియా దృష్టిలో పడుతున్నారు.
దేశ వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. చాలా చోట్ల వడదెబ్బకు(Heat Stroke) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజస్థాన్‌లో(Rajastan) ఈ వారం వడదెబ్బ తగిలి ఏకంగా 12 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. రాజస్థాన్‌లో ఇవాళ గరిష్ఠంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాయి. కానీ రాజస్థాన్‌లోని ఓ మంత్రి మాత్రం సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి చెందిన ఓ ప్రాజెక్టులో రూ.1,140 కోట్ల నష్టం జరిగిందని ఆయన మీడియా ముఖంగా చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉండాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) ప్రజలను కోరారు.
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరకిపోయిన ఘటన రాజస్థాన్‌లో(Rajasthan) జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ(NEET - UG) పరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పుర్ జిల్లాలో అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ ఓ ఎంబీబీఎస్ విద్యార్థి పట్టుబడ్డాడు.
రాజస్థాన్(Rajasthan) సవాయ్ మాధోపూర్(Sawai Madhopur)లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం ఆకస్మాత్తుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
వినోద సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘అయ్యో పాపం..!’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
లోక్‌సభ 2024 ఎన్నికల(Lok Sabha election 2024) నేపథ్యంలో రెండో దశ(second phase) ఎన్నికల ప్రచారానికి(election campaign) నేడు చివరి రోజు. దీంతో ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని అభ్యర్థించనున్నారు.
యూపీఏ అధికారంలో ఉన్నన్నినాళ్లూ దేశం దివాలా తీసిందని.. ఆ పార్టీ భారత్‌ను ఎన్నడూ బలోపేతం చేయలేదని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.