Home » Rajnath Singh
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద సంబంధిత ఘటనలపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారంనాడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనె, జాతీయ భద్రతా సలహాదారులు అజితో ధోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరులు పాల్గొన్నారు.
అగ్నివీర్ చక్రాయుధంలో యువత చిక్కుకున్నారని, అగ్నివీరుల పెన్షన్కు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష నేత ఎప్పుడు కోరినా సభలో సమగ్ర ప్రకటనకు తాను సిద్ధమన్నారు.
పార్లమెంటు ఉభయసభల్లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులు అడ్డుపడరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆదివారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ అప్పీల్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్ నేవీ రాడార్ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్ఎఫ్) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.
జమ్మూ-కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
వెన్నునొప్పి కారణంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండ్రోజుల క్రితం ఆయన వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ విభాగంలో చేరారు.
దేశ రక్షణ రంగ ఉత్పత్తుల్లో కేంద్రం మరో మైలురాయిని చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2023-24లో 16.7 శాతం వృద్ధి రేటు సాధించింది. రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1,26,887 కోట్లకు చేరినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారంనాడు తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం(Indian Army) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.
రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.
హైదరాబాద్తోపాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకుగాను రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.