Home » Rajnath Singh
లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందున బీజేపీ సీనియర్ నేతలు సోమవారం భేటీ అయ్యారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ (BJP) స్పీడప్ చేసింది. తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు వరుసగా దండయాత్ర మొదలెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.
పీఓకేను భారత్లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్కు వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో సత్తా లేదని, అయితే ఆయన పార్టీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే హిందూ, ముస్లిం వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని..
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మండిపడ్డారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని అన్నారు. ఏపీ ప్రగతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావుకి సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.
కాంగ్రెస్ను 'మునిగిపోతున్న నౌక' తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోల్చారు. నౌకకు అడుగున చిల్లు పడిందని, అది మునిగిపోకుండా ప్రపంచంలోని ఏ శక్తీ కాపాడలేదని జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా, బద్వానీ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్ల లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ సాధించి తీరుతుందని, కేంద్రంలో మూడోసారి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని దేశ ప్రజల స్థిర నిశ్చయంతో ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారంనాడు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
లఖ్నవూ లోకసభ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నామినేషన్ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామితోపాటు యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఉన్నారు. అంతకుముందు లఖ్నవూ నగర పుర వీధుల్లో రాజ్నాథ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోడ్ షో ప్రారంభానికి ముందు స్థానిక హనుమాన్ సేతు దేవాలయంలో రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.