Home » Rajnath Singh
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం అంటే.. ఏప్రిల్ 19వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. ఆ క్రమంలో ఈ రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తొలుత అసోంలోని నల్బరీలో.. అనంతరం త్రిపుర రాజధాని అగర్తలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్, కుమార్తె మీసా భారతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారంనాడు పవర్ఫుల్ పంచ్‌లు విసిరారు. జైలులో ఉన్నవాళ్లు, బెయిలుపై బయటకు వచ్చిన వాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జైలుకు పంపతామని అంటున్నారని మిసా భారతిపై మండిపడ్డారు. మీరు ఏదైనా తినండి కానీ ప్రదర్శన ఎందుకని తేజస్విని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. లోక్ సభ ఎన్నికలు కాగానే ఆ పార్టీ డైనోసర్లలా అంతరించిపోతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఎమర్జెన్సీ సమయంలో తన వయస్సు 23 ఏళ్లని.. ఆ వయస్సులో తనను కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాటు జైల్లో పెట్టిందన్నారు.
దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ( India ) పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
''ఒకే దేశం-ఒకే ఎన్నిక'' పేరుతో లోక్‌సభ నుంచి స్థానిక సంస్థల వరకూ ఎన్నికలన్నీ ఒకేసారి జరిపేందుకు కేంద్రం కొద్దికాలంగా కసరత్తు చేస్తోంది. ఆదివారంనాడు లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశ వనరులు, సమయం ఆదా కావాలంటే 'ఒకే దేశం ఒకే ఎన్నిక' తప్పనిసరి అని అన్నారు.
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దుల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని, వారిని పాక్‌గడ్డపైకి అడుగుపెట్టయినా సరే మట్టుబెడతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారంనాడు గట్టి హెచ్చరిక చేశారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయన్నారు.
చైనాతో సరిహద్దు వివాదం, ఇతర శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో.. భారత ప్రభుత్వం రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. యుద్ధ వాహనాలు, సరికొత్త బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మిస్సైల్స్‌ని ఆధునికత ఆధారంగా మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది.
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హోలీ రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకలని ఆమె అన్నారు.