Home » Rajya Sabha
మణిపూర్ హింసాకాండ జ్వాలల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంటులో గురువారం నవ్వులు విరిశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మధ్య జరిగిన సంభాషణతో సభ్యులు గొల్లుమని నవ్వారు. రాజకీయ నినాదాలకు కాసేపు విరామం ఇచ్చి, ఆనందించారు.
న్యూఢిల్లీ: ఏపీ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మరోసారి వివరాలు బయటపెట్టింది. రాష్ట్రంలో బడ్జెటేతర అప్పులు రూ. 79,815 కోట్లని పేర్కొంది. 2021-22, 2022-23... రెండు సంవత్సరాల్లో రూ. 70 వేల కోట్లకు పైగా...
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘర్షణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరం కావాలని భావిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతారని రెండుమూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణంతో 2024 లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య విన్నవించినట్టు తెలుస్తోంది.
సోమవారం నాడు మరోసారి బీజేపీ కేంద్ర కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ సమావేశమై 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వ్యూహాలు.. 3 రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ (Rajyasabha) అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రానున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. జూలై 24న జరిగే ఈ ఎన్నికల్లో డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లామ్, ప్రకాశ్ చిక్ బరైక్, సాకేత్ గోఖలే పోటీ చేస్తారని ఓ ట్వీట్లో తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పట్టు పెంచుకొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశం మలుచుకుని ముందుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డాలు (JP Nadda) వరుస పర్యటనలు, బహిరంగ సభలతో బిజిబిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో (Telangana) , వచ్చే ఏడాది ఏపీలో (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇదే అదనుగా భావించిన బీజేపీ పెద్దలు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిని రాజ్యసభకు తీసుకోవాలని..