Home » Rajya Sabha
రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ రాజస్థాన్ నుంచి, జార్జి కురియన్ మధ్యప్రదేశ్ నుంచి మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తొమ్మిది రాష్ట్రాల్లోని 12 స్థానాలకు జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో(Rajya Sabha by elections) అభ్యర్థులందరూ దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. నామినేషన్ల చివరి రోజైన బుధవారం ఏ రాష్ట్రంలోనూ అదనంగా అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డికి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగపరంగా, న్యాయపరంగా అనేక చిక్కులు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ చట్టాన్ని కేంద్రం పదేళ్లుగా అమలు చేయడం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వానికి భంగం కలుగుతోందని, స్వార్థ రాజకీయం కోసం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ నేతలు ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి శ్రీనివా్సగౌడ్ ఆరోపించారు.
మాజీ బీఆర్ఎస్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు(కేకే) రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి పేరు ప్రకటించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణేతర వ్యక్తికి ఎంపీ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరుగుతున్నారు.
రాజ్యసభ చైర్మన్గా జగదీప్ ధన్ఖడ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించడం కోసం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రాజ్యసభలో నోటీసు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నాయి.
మహిళా సభ్యులతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్ నటి జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది.
రాజ్యసభలో గురువారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ సభ నుంచి వాకౌట్ చేయడం కలకలం సృష్టించింది.
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఖాళీ అయిన 12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.