Home » Rajya Sabha
Rajya Sabha Elections: రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం నాడు ఎన్నిక షెడ్యూల్‌ని విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై మంగళవారం రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఓ ప్రకటన చేశారు. ఆ దేశంలో మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. వారితో ప్రభుత్వం టచ్‌లోనే ఉందని వివరించారు.
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు కేంద్ర హోం శాఖ అమిత్‌షా రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ 'సభా హక్కుల నోటీసు'ను పెద్దల సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.
దేశంలోని ప్రతి రాష్ట్రంలో నమో నగర్ పేరిట హైటెక్ సిటీలు ఏర్పాటు చేయాలని బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. దీంతో నగరాలు పట్టణీకరణ జరగడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు మెరుగైన మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 185కి చేరగా, ఇంకా 225 మంది ఆచూకీ లభించలేదు. అయితే కేరళ(Kerala Landslides) విలయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) తెలిపారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చాలా కామ్ గోయింగ్‌గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా చాలా సాదా సీదాగా ఉంటారు. దేశంలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన అమితాబ్ భార్యగా నిత్యం వార్తల్లో ఉండాలని ఆమె ఏ మాత్రం భావించరు. సరికదా.. అందుకు తగినట్లుగానే ఆమె వ్యవహార శైలి ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్ల దాడి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది.
రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్కడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌కు భారీ షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు ఆయనకు హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల నుంచి. పైగా.. ఇవాళ జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు పలువురు ఎంపీలు గైర్హాజరవడం..