Home » Ranga Reddy
Telangana: జిల్లాలోని వట్టినాగులపల్లిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. గ్రామానికి చెందిన మూడవ తరగతి విద్యార్థి నిన్న (ఆదివారం) కనిపించకుండాపోయాడు. అయితే నిన్న అదృశ్యమైన విద్యార్థి శ్రీనివాస్ శవమై కనిపించాడు. నీళ్లు నిలువ చేసిన నీటి గుంటలో పడి విద్యార్థి దుర్మరణం చెందాడు.
Telangana: చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా నిలిచాయి లా పలోమా విల్లాస్. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నారు. రోడ్లపై వర్షపు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం మొకీల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ‘‘La Paloma Villas’’లోకి వరద నీరు వచ్చి చేరింది.
Telangana: జిల్లాలోని పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ‘‘ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ-హిమాయత్ సాగర్‌లో నిబంధనల ప్రకారమే తాను గెస్ట్‌హౌస్ నిర్మించానని, అక్రమ నిర్మాణం అని తేలితే దానిని తానే కూల్చివేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని నలుగురు మృతిచెందారు.
నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే..
Telangana: శంషాబాద్ బెంగుళూరు హైవే పై ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న పాద చారిని వేగంగా దూసుకొస్తున్న బస్సు ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి గాలీలోకి ఎగిరి బస్సుపై పడ్డాడు. తీవ్ర గాయాలతో పాదాచారి ఘటనా స్థలంలో ప్రాణాలు విడిచాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వరసగా అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అపహరణ కేసులు పెరిగిపోతున్నాయి. పురిటి బిడ్డలను కూడా వదలడం లేదు. ఏదో ఒకటి ఆశ చూపి అభశుభం తెలియని పసివారని ఎత్తుకెళ్లిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి.
హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన బాలిక ప్రగతి (6) ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం ఇనుమూల్ స్వ గ్రామంలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు.