Home » Raptadu
విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పులివెందుల జేఎన్టీయూ మెకానికల్ విభాగాధిపతి వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. మండలంలోని హంపాపురం సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం మొద టి సంవత్సరం విద్యార్థుల కోసం ఓరియెంటేషన డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వేణుగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు.
మండలంలోని వెంకటాపురం, కొత్తగేరి, ముత్యాలంపల్లి గ్రామాలలో మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమాన్ని టీడీపీనాయకులు, అధికారులు సోమవారం నిర్వహించారు.
ఉమ్మడి అనంతజిల్లాలో పేదలకు అనేక సేవలు అందిస్తున్న ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని ఆర్డీటీ అభిమాన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్ర్తీశక్తి పథకాన్ని అమలు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని న్యామద్దల గ్రామంలో డ్వాక్రామహిళలు, టీడీపీ నాయకులు సోమవారం సంబరాలు నిర్వహించారు.
ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అడిషనల్ సెక్రటరీ, ఐఏఎస్ అనిల్ కుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల కళల్లో ఆనందం కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరిలో రైతులతో కలిసి గురువారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో చిరు జల్లులు కురిసినా ఉత్సాహంగా వేలాది మంది రైతులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
సెలూన షా పులకు 200యూనిట్ల మేర సీఎం చంద్రబాబు ఉచిత వి ద్యుత ప్రకటించడంపై నాయీబ్రాహ్మణ సంఘం మండల నాయకు లు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు.
అన్నదాతా సుఖీభవ పథకానికి ఈ కేవైసీ పెండింగ్‌లో ఉన్న రైతులందరూ వెంటనే చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు.
మండలంలోని నసనకోట సమీపంలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం రాప్తాడు నియోజకవర్గ టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎన్నికల పరిశీలకులు ఆదోని క్రిష్ణమ్మ, మస్తానయాదవ్, ఆదినారాయణ ఆధ్వర్యంలో చేపట్టారు.
మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట గ్రామానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నిర్మించడంతో తారురోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 44వ, 42వ జాతీయరహదారులకు పక్కనే ఉన్న ఈ గ్రామానికి రోడ్డు గుంతల మయంగా ఉంది.