Home » Ravichandran Ashwin
టీమిండియాతో ఐదో టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టేల్స్ చెప్పాడు. టాస్ టేల్స్ పడడంతో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు మ్యాచ్‌తో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో 100 టెస్టులు ఆడిన 14వ భారత క్రికెటర్‌గా నిలవబోతున్నాడు.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టు మ్యాచ్ ద్వారా వీరిద్దరు తమ తమ వ్యక్తిగత కెరీర్లో 100 టెస్టుల మైలురాయిని చేరుకోబోతున్నారు.
భారతీయ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో బెన్ డకెట్, ఒల్లీ పోప్ వికెట్లను తీసిన అశ్విన్ టెస్ట్ ఫార్మాట్లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు.
శుక్రవారం నుంచి మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జోరూట్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఇంగ్లండ్‌తో మొదలైన నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్‌పై 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.
తల్లి అనారోగ్యం కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్లిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. మూడో టెస్టు నాలుగవ రోజున అశ్విన్ తిరిగి జట్టుతో కలవనున్నాడని క్లారిటీ ఇచ్చింది. అంటే నేడు (ఆదివారం) జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐ వెల్లడించింది.
టెస్టు క్రికెట్లో 500 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన టీమిండియా సినియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
కొన్ని సంవత్సరాల నుంచి భారత క్రికెట్ జట్టుకి ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా తాజాగా సంచలన రికార్డ్ నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో.. టీ20, వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి బౌలర్‌గా బుమ్రా చరిత్రపుటలకెక్కాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. భారత్ విసిరిన 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడుతోంది. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొలేక ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.