Home » Revanth Reddy
యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
మహా నగరం హైదరాబాద్లో చెరువులను ఆక్రమించి చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన ఇల్లు చట్టవిరుద్ధంగా ఉంటే కూల్చివేయాలని అన్నారు.
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య డీల్ కుదరడంతోనే బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ స్పందించింది.
హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తర మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని, పార్టీలతో సంబంధం లేదని, హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో డెంగ్యూ, ఇతర జ్వరాలకు సంబంధించిన మరణాల లెక్కలను దాస్తున్నారంటూ విపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీజనల్ వ్యాధుల విషయంలో అధికారుల పనితీరుపై ఆయన సీరియస్ అయ్యారు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.
బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. అందుకే బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాల్లో రైతులు ఎవరు పాల్గొన లేదన్నారు. అసలు ప్రతిపక్ష పార్టీ ఉనికి కోసమే ధర్నాలు చేపట్టిందంటూ బిఆర్ఎస్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలకు ప్రజల నుంచి స్పందనే లేదన్నారు. అందుకే ఒక్క రోజు చేసి ఢిల్లీకి ప్రయాణమవుతున్నారని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీ వెళ్లనున్నారు.
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కెవిపి రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ తదితరులకు ఫామ్ హౌస్లున్నాయన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో కూడా తాను చూపిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎలా ఉందని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు.
‘‘నామాటలు గుర్తుంచుకో.. చీ(ఫ్)ప్ మినిస్టర్.. మేం అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేడ్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..