Home » Revanth Reddy
సరిత తిరుపతయ్య.. ఈ పేరు ప్రస్తుతం పాలమూరు జిల్లా రాజకీయాల్లో మారుమోగుతోంది. ఆమెను పార్టీలోంచి పంపించేద్దామని ఒకరనుకుంటే.. ఆ అనుకున్న మనిషినే పార్టీ వీడి వెళ్లేలా చేశారామే.. అందుకే సరిత తిరుపతయ్య పేరు వార్తల్లో నిలుస్తోంది.
స్కిల్ డెవల్‌పమెంట్ యూనివర్సిటీ శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా.. కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు.
రాష్ట్రంలో పంచాయతీలకు సరిపడా నిధులు ఇవ్వడంలేదని, దాంతో పల్లెలు ఏడుస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
Telangana: తెలంగాణలో రాజకీయాలు(Telangana Politics) మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సహజంగానే విపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవుతుంటారు. రాష్ట్ర కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నుంచి ఇప్పటి వరకూ అలాగే జరిగింది.
స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైన గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లకు రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోకన్ సాహు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేల్, లక్ష్మీ కాంతారావు, వేముల వీరేశం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే.. రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అసెంబ్లీలో భజన బ్యాచ్ ఎక్కువైపోయిందన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.