Home » Revanth Reddy
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2024-25 మరికాసేపట్లో అసెంబ్లీ ముందుకు రాబోతోంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నారు.
బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందని.. రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ శాసనసభలో జరిగిన చర్చపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
రేవంత్ రెడ్డి సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న చర్చపై కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం(ఈ నెల 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టి.. అదేరోజు సమాధానం ఇవ్వనుంది.
మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు.
‘తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల ఖర్చయితేనే కాంగ్రెస్ గల్లీనుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది. అలాంటిది.. మూసీ సుందరీకరణకు రూ.లక్షా యాబైవేల కోట్లా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని?
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
లక్డీకాపూల్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐ3సీ)కు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.