Home » Rishabh Pant
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ముదులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (88) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తాండవం చేయడం, అక్షర్ పటేల్ (66) అర్థశతకంతో రాణించడం...
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ప్రమోషన్ వచ్చిందా? అతనికి భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్‌కి ఎంపిక చేయబోయే జట్టుకి.. పంత్‌నే కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నారట.
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందుతారు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి.. జట్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టు గురించి చర్చించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని రోజుల క్రితం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని కలిశాడని వార్తలు వచ్చాయి.
ఒక్కోసారి ఆటగాళ్లు మైదానంలో సహనం కోల్పోతుంటారు. తమకు అనుకూలంగా తీర్పు రానప్పుడు.. అంపైర్లపై కోపం ప్రదర్శిస్తుంటారు. వాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అదే పని చేశాడు.
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 15 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2024 ద్వారానే రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డాడు. దీంతో పంత్‌కు ఐపీఎల్ నిర్వహకులు భారీగా జరిమానా విధించారు. గత మ్యాచ్‌లో విధించిన జరిమానా కన్నా ఇది రెండింతలు కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ సారి జట్టులోని సభ్యులందరికీ కూడా జరిమానా విధించారు.
ఐపీఎల్ 2024లో తొలి విజయం సాధించిన జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన రిషబ్ పంత్‌కు భారీగా జరిమానా పడింది. విశాఖపట్నం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ పాలక మండలి పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. టాపార్డర్ బ్యాటర్లు రిషబ్ పంత్(51), డేవిడ్ వార్నర్(52) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరికి తోడు యువ ఓపెనర్ పృథ్వీషా(43) కూడా రాణించాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.