Home » RJD
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బీహర్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో సోమవారం నాడు నితీశ్ కుమార్ బలం నిరూపించుకోవాల్సి ఉంది.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ త్వరలో అసెంబ్లీలో బల పరీక్షకు వెళ్తున్న వేళ.. ఆర్జేడీ(RJD)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కనిపించకకుండా పోవడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నితీశ్(Nitish Kumar) మహాఘట్బంధన్ను వీడి బీజేపీ(BJP)లో చేరిన అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ "ఆట ముగియలేదు" అని కామెంట్స్ చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
బిహార్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్.
రాష్ట్రీయ జనతాదళ్ (RJD)తో రెండేళ్ల అనుబంధానికి జనతాదళ్ (యునైటెడ్) ముగింపు పలికి సీఎం నితీష్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) తో పొత్తు పెట్టుకుని మళ్లీ సీఎంగా ఇదే రోజు సాయంత్రం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
బీహార్‌లోని అధికార 'మహాఘట్బంధన్' ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమవుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో కూటమి భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ సైతం చురుకుగా పావులు కదుపుతోంది. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారంనాడు సమావేశమయ్యారు.
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తుండగా, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం హస్తినలో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై ఆర్జేడీ సైతం వరుస సమావేశాలు జరుపుతోంది.
బిహార్‌లో ఆర్జేడీ - జేడీయూ(RJD - JDU) శిబిరంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్రం భారత రత్న ప్రకటించడాన్ని ప్రశంసిస్తూ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్ చేశారు.