Home » Road Accident
కంటోన్మెంట్ ప్రాంతంలోని సికింద్రాబాద్ క్లబ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. గురువారం సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది.
సత్తుపల్లి(Sathupally) మండలం కిష్టారం(Kishtaram) ఓసీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ(Lorry) ఢీకొట్టడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(52), కుమారుడు అశోక్(30)గా గుర్తించారు.
వివాహానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని(Rajasthan) మోతీపురాకు చెందిన వివాహ బృందం 28 మందితో బంధువుల ఇంట్లో వివాహానికి ఆదివారం రాత్రి బయల్దేరింది.
దేవరపల్లి మండలం బందపురం వద్ద జాతీయ రహదారి(National Highway) ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని(lorry) వెనక నుంచి కావేరి ట్రావెల్స్(Kaveri Travels) బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు తీవ్రగాయాలు అయ్యాయి. మరో 10మందికి స్వల్పగాయాలు అయ్యాయి.
డ్రైవర్ నిద్రమత్తో లేదంటే అతివేగం లేదంటే మరో కారణమో కానీ తెల్లవారేసరికి నలుగురి బతుకులు తెల్లారిపోయాయి. హైదరాబాద్కు ఆనందంగా బయలు దేరిన ఓ కుటుంబం దాదాపు గమ్యానికి చేరువలో ఉండగానే అంతులేని విషాదంలో మునిగిపోయింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి స్కార్పియో వాహనంలో ఏడుగురు వ్యక్తులు హైదరాబాద్కు బయలు దేరారు.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
జోగులాంబ గద్వాల జిల్లా: ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం.. లారీని ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో తండ్రి, కొడుకు మృతిచెందారు. అదే వాహనంపై ఉన్న తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
జమ్మూకశ్మీర్లో గురువారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు జమ్మూ జిల్లాలో అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోవడంతో 22 మంది దుర్మరణం చెందారు.
రఘునాథపాలెం మండలం హర్యాతండాలో నిన్న జరిగిన కారు ప్రమాద ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.