Home » Rohit Sharma
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. వీరిద్దరూ వేరే వేరు జట్లకు ఆడుతున్నప్పటికీ.. తమ ఫామ్‌ని మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. రోహిత్ సెంచరీ చేయగా.. విరాట్ హాఫ్ సెంచరీ చేసి క్రీజులో కొనసాగుతున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచులో సిక్కిం 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ముంబైకి 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుస హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. ముంబై తరఫున ఎలా ఆడతాడో చూడాలి.
నేటి నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ-ఆంధ్ర తలపడుతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఆడుతుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రో-కో ఈ మ్యాచులకు ఎంత పారితోషికం తీసుకుంటారనే దానిపై చర్చ నడుస్తుంది.
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ , ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్లేయర్లు ఆయా జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు.
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదని.. కావాలంటే ఇంగ్లండ్ ప్లేయర్లను అడగండని టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అన్నాడు. ఆసీస్ వేదికగా జరిగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-3తేడాతో సిరీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.
రెండేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం తాను క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానని రోహిత్ శర్మ అన్నాడు. ఆ సమయంలో తనతో పాటు జట్టంతా తీవ్ర నిరాశకు గురైందని ఓ కార్యక్రమం సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు హిట్‌మ్యాన్.
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. తన కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. అందులో అత్యంత ముఖ్యమైనది.. మూడు సార్లు డబుల్ సెంచరీ చేయడం! అందులో ఒకటి 2017 డిసెంబర్ 13న శ్రీలంకపై 208* పరుగులు చేశాడు.
భారత్ వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు త్వరలో బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ లో వారి కేటగిరీని మార్చనున్నారని తెలుస్తుంది. అదే జరిగితే వారి జీతంలో రూ.2 కోట్లు తగ్గనుంది.
రానున్న వన్డే ప్రపంచ కప్‌లో రో-కోలను ఆడించాలని టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ యాజమాన్యానికి సూచించాడు. వారు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని.. వారి కంటే మెరుగైన ఆటగాళ్లు లేరని వెల్లడించాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం వన్డే క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తాజాగా, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రో-కోపై ప్రశంసలు కురిపించాడు.