Home » RSS
జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక ప్రకటన చేసింది. అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలే తప్ప ‘రాజకీయాంశం’ ఎంతమాత్రం కాకూడదని హితవు పలికింది.
కుల గణనపై దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతుంది. అలాంటి వేళ.. కుల గణనపై బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టత ఇచ్చింది. కుల గణన అనేది సున్నితమైన అంశమని పేర్కొంది. ఈ అంశం సామాజిక వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలని తెలిపింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతను అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్‌కు పెంచింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానమైన భద్రత మోహన్ భగవత్‌కు లభిస్తుంది.
భారతీయ సమాజాన్ని కుల వ్యవస్థే సమైక్యంగా ఉంచుతోందని ఆర్‌ఎ్‌సఎ్‌సకు చెందిన ‘పాంచజన్య’ పత్రిక పేర్కొంది. మొగల్ పాలకులు దీనిని అర్థం చేసుకోలేదని.. బ్రిటిషర్లు మాత్రం కనిపెట్టి ‘విభజించి-పాలించు’ విధానంలో దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని తెలిపింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై ఉన్న నిషేధాన్ని కేంద్రప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనే అవకాశం కలిగింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా 1966లో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ నెల 9న ఈ ఉత్తర్వులిచ్చినట్లు బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ సోమవారం ‘ఎక్స్’లో తెలిపారు.
బ్రిటిషర్లు 1857 తరువాత భారతీయ సంప్రదాయాలు, పూర్వీకులపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించేందుకు క్రమపద్ధతిలో ప్రయత్నాలు చేశారని ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) శనివారం పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్సీపీతో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' ఒక రిపోర్ట్‌లో తెలిపింది.
పార్లమెంట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి ఎన్డీఎ భాగస్వామ్య పక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ పిలుపు నిచ్చారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఆదివారం పట్టణంలోని అన్ని వార్డులలో బీజేపీ నాయకులు నిర్వహించారు.