Home » Russia-Ukraine war
ఉక్రెయిన్ నుంచి డ్రోన్ దాడులు భయపెడుతున్న వేళ.. రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధం కొలిక్కిరాని సమయంలో.. పాశ్చాత్య దేశాలు మరిన్ని ఆయుధాలిస్తే ప్రత్యర్థిని ఓడిస్తామని జెలెన్ స్కీ కోరుతున్న సందర్భంలో రష్యా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
ఉక్రెయిన్, రష్యా మధ్య రెండున్నరేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోరారు. మోదీ-బైడెన్ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.
ఆయుధాగారాలే లక్ష్యంగా రష్యాపై విరుచుకుపడుతోంది ఉక్రెయిన్..! గత బుధవారం ట్వెర్ ప్రావిన్స్ తుర్పెట్ గ్రామంలో ఉన్న భారీ డిపోను ధ్వంసం చేసి కలకలం రేపింది..!
బాంబుల మోత.. తుపాకీ కాల్పులు.. తెలియని దేశం.. ఒక్క పూట భోజనం.. 15 గంటల పని.. దట్టమైన అడవి.. గడ్డ కట్టించే చలి.. స్లీపింగ్ బ్యాగులో నిద్ర.. ఇలా ఎనిమిది నెలలు నిత్యం నరకమే.
ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించటానికి రష్యా.. భారత్ నుంచి ఎలకా్ట్రనిక్స్ తదితర కీలక సామగ్రిని, టెక్నాలజీలను రహస్యంగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం విరమించుకునే విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించగలవని ఆయన అన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రష్యా క్షిపణులు ఒక విద్యా సంస్థను, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్టు జెలెన్స్కీ తెలిపారు. శిథిలాల క్రింద చిక్కుకున్న పలువురిని రక్షించినట్టు చెప్పారు. 180 మందికి పైగా గాయపడగా, 41 మంది వరకూ మరణించినట్టు సమాచారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్కు మిత్ర దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) మాట్లాడారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటనపై కూడా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. తమదేశంలోకి చొచ్చుకువస్తున్న ఉక్రెయిన్కు చెక్ పెడుతూ.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 200కు పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిపింది.