Home » S Jaishankar
ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ, భారత్ నిర్దిష్ట నియమాలు, నిబంధల కింద ఆపరేషన్ చేపట్టిందనని జైశంకర్ అన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి, దేశ ప్రజలకు, మీడియాకు, పౌర సమాజానికి జవాబుదారీగా నిలిచిందని చెప్పారు.
వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని జైశంకర్ చెప్పారు. యూఎస్‌తో వాణిజ్యం అనేది చాలా ముఖ్యమైన అంశమని, సహేతుకలైన నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. రాజధాని కాబుల్‌లో భారత రాయబార కార్యాలయం మళ్లీ..
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుడిని గతంలో చూడలేదని జైశంకర్ అన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్‌లు వినియోగిస్తుండటం కొత్తగా ఉందని ఉన్నారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన ఖరారైంది. ఈనెల 20-21 తేదీల్లో ఆయన మాస్కోలో పర్యటించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని జైశంకర్ పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.
అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను జైశంకర్ కొట్టివేశారు. ఏప్రిల్ 22 జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 2024 అక్టోబర్‌లో సమావేశం జరిపిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా సాగుతున్నాయని జైశంకర్ చెప్పారు. ఇదే విధంగా కొనసాగితే రెండు ఆసియన్ జెయింట్లకు పరస్పర ప్రయోజనం చేకూరుతుందన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడిని ఆర్థిక యుద్ధ చర్యగా (Economic Warfare) జైశంకర్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని చూడలేక అక్కడి పర్యాటకాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడ్డారని చెప్పారు.
రష్యాపై వెస్ట్ దేశాల ఆంక్షలు విధించినప్పుడు ఇండియా ఎందుకు చేరలేదని అడిగినప్పుడు, విభేదాలు యుద్ధంతో పరిష్కారం కావని తాము నమ్ముతామని జైశంకర్ చెప్పారు.