Home » sajjanar
Telangana: హైదరాబాద్ శివారు నుంచి దసరాకు స్పెషల్ బస్ సర్వీసులు నడుస్తాయని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులను సిద్ధం చేశామన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలచే బస్సులను కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి నడిపించనున్నామని, ఆ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుపుతున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నిమజ్జన కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రజలు ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందులు పడకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత రీల్స్ కోసం చేయరాని పనులన్నీ చేసేస్తున్నారు. కొందరు ప్రాంక్ వీడియోల పేరుతో జనాన్ని ఇబ్బంది పెడుతుంటే.. మరికొందరు ఛాలెంజ్ వీడియోల పేరుతో అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. ఇటీవల ఇలాంటి వీడియోలు చేసే వారు రోజు రోజుకూ పుట్టకొకరు, చెట్టుకొకరు అన్నట్లుగా..
‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ.సజ్జనార్ ఘనంగా సన్మానించారు.
ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ..
తెలంగాణ ఆర్టీసీ సంబంధించి ఫేక్ లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్ లోగోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబాద్ కమిషనరేట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో టీజీఎస్ఆర్టీసీ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు.
Andhrapradesh: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్(BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆరోపించారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే కారణంతోనే కాంగ్రెస్ తమపై కక్షకట్టిందన్నారు.