Home » Sangareddy
కొత్తగా 10 ఆర్టీసీ డిపోల ఔటర్‌రింగ్ రోడ్డు లోపల శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. మేడ్చల్, రంగారెడి, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త డిపోలు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది.
నల్లకుంట చెరువు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చుట్టు పక్కల ఉన్న వందల ఎకరాలలో పంట పొలాల్లో ఎరుపు రంగునీరు వచ్చి చేరింది.
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి లేఖ ఇచ్చినా కలెక్టర్ ప్రావీణ్య పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మాణిక్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గంలో తాను సూచించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు.
ఓ విద్యార్థిని షూలో పాము ప్రత్యక్షమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి సంగారెడ్డిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జూన్ 30న జరిగిన సిగాచీ ఔషధ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడుకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్ గేట్లు మొరాయిస్తుండటంతో నీరంతా వృథాగా పోతోంది. ఇటీవలి భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి పోటెత్తిన వరదతో మంజీరా బ్యారేజీ జలకళ సంతరించుకుంది.
కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. పక్కా ప్లాన్ ప్రకారమే బాలికను హత్య చేసిన దుండగులు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Telangana heavy rains: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బూచనెల్లి గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.
మంజీరా నదిపై ఉన్న సింగూరు డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) స్పష్టం చేసింది.