Home » Sangareddy
స్వాతంత్య్ర సమరయోధుల వారసులు కొందరు అక్రమానికి పాల్పడ్డారు. తమది కాని ఆ భూమిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అడ్డదారి తొక్కారు. ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిరంభ్యంతర పత్రం (ఎన్వోసీ) సృష్టించి దొరికిపోయి కటకటాలపాలయ్యారు.
ఫిలిప్పైన్స్‌లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డికి బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలసి 11 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. జైలులో ఉన్న లఘుచర్ల గ్రామ రైతులను కేటీఆర్ బృందం పరామర్శించనుంది.
పట్టపగలు అందరూ చూస్తుండగా తల్లి, ఆమె కుమారుడిని కత్తితో పొడిచి చంపేశాడో వ్యక్తి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఇంతవరకు పరిశోధనలు చేపట్టడానికి విదేశాలకు వెళ్తున్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం(Geetam Deemed University) అధ్యాపకులు ఇప్పుడు తమ వృత్తి నైపుణ్యాన్ని విదేశీ విద్యార్థులతో కూడా పంచుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని రంజోల్ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి జహీరాబాద్ మీదుగా హైదరాబాద్‌కు కంటైనర్‌లో 8 టాటా నెక్సాన్ కార్లను తరలిస్తుండగా షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకులానికి చెందిన 12 మంది విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.
కారు డ్రైవింగ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఓ వైద్యుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ సమీపంలో జరిగింది.
గంజాయి ముఠాలు పట్టుబడితే ఆ పోలీసులకు పండగే! పట్టుబడ్డ సరుకులోంచి కొంత దారి మళ్లించి సొమ్ము చేసుకుంటారు. కొన్ని నెలలుగా వారిది ఇదే పని! ఓ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారించిన సమయంలో ఈ దందా బయటపడింది.
సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నిర్మాణాన్ని అడ్డుకొని గోడ కూల్చారంటూ ఓ వర్గంపై మరో వర్గం కుకూనురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టుయిన వారికి బీజేపీ ఎంపీ ఆర్ రఘునందన్‌రావు మద్దతుగా నిలిచారు.