Home » Sankara Sankara
భారతీయ సంస్కృతికి ప్రాణం వంటి సంస్కృత భాష సామాన్యుల్లో కొంతైనా బ్రతుకుతున్నదంటే స్తోత్ర సాహిత్య ప్రభావమేనన్న సత్యాన్ని ఆధునికులు సైతం అంగీకరించవలసినదేనని ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు. తాజాగా ఆయన రాయదుర్గం సమీపంలోని శ్రీమరకత మహాలింగాన్ని దర్శించుకుని, అభిషేకార్చనల్లో పాల్గొన్న అనంతరం మంగళమయ లింగార్చనలు, అపురూప శివస్తోత్రాల మాధుర్యం నిండిన ‘శంకర ... శంకర’ గ్రంధాన్ని ఆవిష్కరించారు.
బళ్లారి శ్రీ అమృతేశ్వర ఆలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.., నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు సందర్భోచితంగా భక్తి స్వాగతం పలుకుతూ పురాణపండ శ్రీనివాస్ అమృతలేఖిని నుంచి జాలువారిన రెండు అమోఘ గ్రంధాలను సాయి కొర్రపాటి మహా శివరాత్రి నుండి బళ్ళారి ఆలయానికి విచ్చేస్తున్న వేల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఆనందం కలిగిస్తోంది.
పురాణపండ శ్రీనివాస్ ‘శంకర శంకర’ గ్రంధం శ్రీశైలంలో , తిరుమలలో ‘స్మరామి స్మరామి’ గ్రంధం భక్తలోకాన్ని విస్మయింపచేసిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అన్నారు.