Home » SBI
బ్యాంకు మోసానికి పాల్పడి రెండు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ఆర్థిక నేరగాడిని సీబీఐ అధికారులు 22 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా నిందితుడి కోసం అధికారులు గాలిస్తుండగా.. తప్పించుకు తిరుగుతూ.. సీబీఐ అధికారులనే దేశమంతా తిప్పాడు.
జిల్లాను వరస దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకే(ఎస్బీఐ) లక్ష్యంగా దుండగులు దాడులకు తెగబడుతూ లక్షల సొత్తును కాజేస్తున్నారు. సినిమా లెవల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
మీరు రిస్క్ లేకుండా కొన్నేళ్లపాటు కొంత మొత్తాన్ని పెట్టుబడి(investment) పెట్టి గరిష్ట లాభాలను ఆర్జించాలని చుస్తున్నారా. అయితే మీకోసం రెండు ప్రభుత్వ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పొదుపు చేయడం ద్వారా ఎలాంటి రిస్క్(no risk) ఉండదు. అందుకోసం SBI FD, పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకాలు ఉన్నాయి. అయితే వీటిలో దేనిలో 5 లక్షల రూపాయలు 10 ఏళ్లపాటు పొదుపు చేస్తే లాభం ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో నిందితుడు శ్రవణ్ను తమ ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ (SBI) నుంచి రుణం తీసుకోవడం ఇవాళ్టి (సోమవారం) నుంచి మరింత ప్రియం కానుంది. వడ్డీ రేట్లు భారం పెరగనుంది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నూతన ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి(Challa Sreenivasulu Setty) నియమితులవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ పార్టీల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్త చైర్మన్గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టి పేరు దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం ఎస్బీఐ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శెట్టి బ్యాంకు తదుపరి చైర్మన్ కానున్నారు.
ఎస్బీఐ రివార్డు పాయింట్ల(SBI Reward Points) పేరుతో ఓ ప్రభుత్వ ఉద్యోగినిని, పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టి మరో వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. పార్శిల్ బాధితుడి ఖాతా నుంచి రూ. 15.36 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగిని ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎం(SBI ATM)లో చోరీకి పాల్పడి సుమారు రూ.17లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన పరవాడ(Paravada) దేశపాత్రునిపాలెంలో చోటు చేసుకుంది. రాత్రి వేళ కారులో వచ్చి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతానికి పాల్పడ్డారు.