Home » SBI
బీఆర్ఎస్ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి ఎస్ఐబీ చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సర్వేలో.. బీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది.
ఇటివల కాలంలో సైబర్ మోసాలు(cyber crime) పెరిగిపోయాయి. గతంలో అయోధ్య రామ మందిరం సహా పలు సందేశాల పేరుతో అనేక మందిని లూటీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కేటుగాళ్లు దేశంలోనే ప్రముఖ బ్యాంకైన SBI పేరుతో పలువురికి సందేశాలు పంపిస్తూ దోపిడికీ పాల్పడుతున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) ఎస్బీఐ వడ్డీరేట్లు పెంచింది. ఎఫ్‌డీల కాల పరిమితిని బట్టి ఈ పెంపు 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఉంటుంది...
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కస్టమర్లకు వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచింది. ఈ క్రమంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై SBI కొత్త వడ్డీ రేట్లను 0.25 నుంచి 0.75 శాతం వరకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్ డిస్క్‌ల విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అరె్‌స్టకు వారెంట్ జారీ అయింది. ప్రభాకర్‌రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్‌పై కూడా నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
సమాచార హక్కు (సహ) చట్టం కింద ఎన్నికల బాండ్ల వివరాలను అందజేసేందుకు ఎస్బీఐ నిరాకరించింది. ఇప్పటికే ఆ వివరాలన్నీ ఈసీ వెబ్సైట్లో ఉన్నప్పటికీ.. డబ్బుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారమైనందున బాండ్ల వివరాలను వెల్లడించలేమని ఎస్బీఐ తెలియజేయడం గమనార్హం.
మీకు ప్రతి నెల కొంత అదనపు ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అందుకోసం బెస్ట్ స్కీం ఉంది. అదే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్(SBI Annuity Deposit Scheme). దీనిలో ఒకేసారి కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు నెలవారీ వడ్డీని కూడా పొందవచ్చు.
నూతన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆరంభం కానున్న నేపథ్యంలో పలు ఆర్థిక సంబంధ నిబంధనలు మారబోతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాకింగ్ దిగ్గజం ఎస్బీఐ కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. పలు డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సవరించిన కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.
Credit Card New Rules April 1st: మీరు క్రెడిట్ కార్డ్(Credit Card) వినియోగిస్తున్నారా? మీ కార్డ్‌పై ఆఫర్స్ ఉన్నాయా? అయితే, ఇప్పుడు ఆ ఆఫర్స్ వర్తించకపోవచ్చు! అవును, మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు బ్యాంకులు(Banks) కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis), ఎస్ బ్యాంక్(YES Bank) వంటి ప్రధాన బ్యాంకులు..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) కేసుకు సంబంధించి గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఎస్బీఐ ఈసీకి(EC) అందజేసింది. సీరియల్ నంబర్లతో సహా ఈసీకి అప్పగించింది.