Home » Secunderabad
తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎక్స్ రే యంత్రాలు పని చేయడం లేదు. ఆస్పత్రి మొత్తం ఐదు యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి.
ప్రయాణికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.07601 సికింద్రాబాద్-విల్లుపురం ప్రత్యేక రైలు సికింద్రాబాద్లో ఈ నెల 7,14 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది.
ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో అతడిని చంపి ఏకంగా కర్ణాటకకు తీసుకెళ్లి ఓ కాఫీ తోటలో శవాన్ని దహనం చేశారు.
శని, ఆదివారాల్లో సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
దీపావళి, ఛత్ పండుగల(Diwali and Chhat festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చేందు ప్రయాణికుల సౌకర్యార్థం 804 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహించిన సికింద్రాబాద్ మెట్రో పొలిస్ హోటల్ యజమాని రషీద్, మేనేజర్ రహమాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లోని కుమ్మరిగూడలో ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో శుక్రవారం హిందూ సంఘాలు ఇచ్చిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలు పోలీస్ స్టేషన్లలో ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్కెట్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదు కాగా.. గోపాలపురం పీఎస్లో మరో కేసు నమోదు అయింది. ఈ బంద్ నేపథ్యంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు పలుమార్లు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.
సికింద్రాబాద్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. వీరంతా కలిసి మహంకాళి టెంపుల్ నుంచి విగ్రహం ధ్వంసం అయినా టెంపుల్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.