Home » Secundrabad
నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్(Hubli Division) పరిధిలో భీమా వంతెన వద్ద రైల్వేట్రాక్ మునిగిపోవడంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.
పండుగకు ఎప్పుడు వస్తున్నావ్ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే.
తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు, ట్రాక్ల కింద మట్టి కొట్టుకుపోవడంతో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) చాలా రైళ్లను రద్దు చేసింది. దీంతో ఆయా ప్రాంతాలకెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది.
దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు(Danapur Express Train) అంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోయేవారు. ఇప్పటి వరకు ఈ రైలు రిజర్వేషన్ బోగీల్లో సాధారణ ప్రయాణికులు, టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసే వారే ఎక్కువగా కనిపించేవారు. రిజర్వేషన్ చేసుకున్న బెర్తులో ప్రయాణికులను బెదిరించి బీహారీలు కూర్చునేవారు.
బీదర్, పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో(By Bidar, Padmavati Express train) దొంగలు పడ్డారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్(Vijayawada to Secunderabad) వైపు వస్తున్న పద్మావతి, బీదర్ ఎక్స్ప్రెస్ రైలులో ఎస్- 4,9,10 బోగిలోని ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు తెంచుకుని పారిపోయారు.
నిర్వహణ పనుల కారణంగా ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్(Secunderabad) నుంచి బయల్దేరాల్సిన సికింద్రాబాద్-కొల్లం(Secunderabad-Kollam) (నంబర్: 07193) రైలు, ఈనెల 14వ తేదీన కొల్లం నుంచి బయల్దేరాల్సిన కొల్లం-సికింద్రాబాద్ (నెంబర్: 07194) రైలును రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.
లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల(Secunderabad, Malkajigiri, Chevella) నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం చేసుకుంటామని, హైదరాబాద్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, నిర్వహించిన సంక్షేమ పథకాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్(Thiegulla Padma Rao Goud) అన్నారు.