Home » Shamshabad
శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెనూను తెలుగులోనూ ముద్రించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైపూర్ వెళ్తున్న ఇండిగో విమానం 6ఈ 815 టేకాఫ్ అయిన తర్వాతతిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది.
లోన్ యాప్ల ఉచ్చులో చిక్కుకున్న ఓ యువకుడు అప్పుల పాలై, వాటిని తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్పోర్టుల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4వ స్థానం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు శుక్రవారం రద్దయ్యాయి. సాంకేతిక లోపం తలెత్తడంతోనే రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్జెట్ విమానం (ఎస్జీ-2696)లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. జీఎంఆర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
Road Accident: శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తా పడిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది.
కేసీఆర్ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
ఓ మహిళ విమానంలో మహిళ హల్చల్ చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలు హల్చల్ చేసింది. ఎమర్జెన్సీ డోర్ తీయడానికి యత్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Fake Visa Gang Arrested: నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 నకిలీ వీసాలను సీజ్ చేశారు. నకిలీ వీసా ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.