Home » Shashi Tharoor
కాంగ్రెస్లో మెజార్టీ నాయకులు హిందువులేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) తెలిపారు. హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తామని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ద్వేషం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండనే ఉండదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఈసారి 400కు పైగా సీట్లు గెల్చుకుంటామని బీజేపీ(BJP) చెబుతోంది. మరోవైపు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత శశి థరూర్(Shashi Tharoor) లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్లో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. వారెవరో, వారి నియోజకవర్గాలేంటో తెలుసుకుందాం.
తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.
దేశంలో లోక్సభ ఎన్నికల(lok sabha elections 2024) హాడావిడి మొదలైంది. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేరళ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన తిరువనంతపురం(thiruvananthapuram) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కు తన ప్రచారంలో భాగంగా మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న తనపై అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శశిథరూర్ తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
దక్షిణ భారత్ మినహా అంతటా పట్టు నిలుపుకుంటున్న బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం విదితమే. 195 మంది అభ్యర్థులతో ఈ లిస్టు విడుదలైంది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బుధవారం లోక్సభలో మధ్యంతర బడ్జెట్పై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్’ అని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై(Union Budget 2024) కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్(Shashi Tharoor) విమర్శలు సంధించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం లెక్కల పేరుతో గారడీలు ప్రదర్శించిందని విమర్శించారు.
లోక్ సభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్(Congress) పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలకమైన మేనిఫెస్టోని(Congress Manifesto) రూపొందించడానికి ఇప్పటికే ఓ కమిటీ వేసింది.