Home » Siddipet
డెంగీతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు మహిళ కాగా, మరొకరు ఐదో తరగతి విద్యార్థి.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల కాలం చెల్లిపోకముందే వాటిని లబ్ధిదారులకు అందజేయాలని సిద్దిపేట నియోజకవర్గ రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ శ్రీకృష్ణుడు చేతిలో వేణువు ధరించి సుందరమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ సిద్దిపేట జిల్లా చెల్లాపూర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన రూపంలో ఆయన కనువిందు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు(seasonal diseases) విజృంభిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు.
డెంగీ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల చిన్నారి సహా ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. సిద్దిపేటలోని రాజు, రజిత దంపతుల కుమారుడు అయాన్ష్ (5)కు ఈ నెల 19న జ్వరమొచ్చింది.
‘ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) రాజీనామా చేయాలి. సిద్దిపేటలో నీ మీద నేనే పోటీ చేస్తా. నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఓడిపోతే నువ్వు కూడా తప్పుకుంటావా’ అని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు(Mainampalli Hanumantha Rao).. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సవాల్ విసిరారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌కు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఛాలెంజ్ చేశారు. ‘తెలంగాణ, సిద్దిపేట.. నీ యబ్బ జాగీరా..? రుణమాఫీ 200 శాతం అమలు చేస్తున్నాం.. హరీశ్.. మరీ నీ సంగతి ఏంది..? మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా..’ అని సవాల్ చేశారు..
ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా తీవ్రమైన ఉక్కపోత నడుమ వాన పలకరించింది. రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల మోస్లరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మెదక్‌లో గంటపాటు వాన పడింది.
రుణమాఫీ అంశం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్లెక్సీల వార్ నడిచింది.