Home » Siddipet
రుణమాఫీ అంశం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్లెక్సీల వార్ నడిచింది.
Telangana: రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లాలో హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపిపంచారు. ఆదివారం నాడు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 229 మందికి రూ. 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు.
వారం రోజుల్లో రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు.
నాటు బాంబు పేలి(Bomb Explosion) ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన హుస్నాబాద్ మండలం మీర్జాపూర్(Mirzapur)లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు కలీం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనుల చేస్తున్న సమయంలో గేదెను కట్టేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు.
తల్లి చనిపోయిన బాధలో ఉంటే.. కొడుకే హంతకుడంటూ పోలీసులు అరెస్టు చేశారు. నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) 161 ప్రకారం నేరాంగీకార పత్రం(కన్ఫెషన్) ఆధారంగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న సిద్దిపేట స్టీల్ బ్యాంకు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.