Home » Siddipet
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న సిద్దిపేట స్టీల్ బ్యాంకు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
Telangana: నాలుగు రోజుల క్రితం కొండపాక మండలం దమ్మక్క పల్లి గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు బండి కిష్టయ్యను.. మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. భూ తగాదాల విషయంలో గడ్డి మందు సేవించి బలవన్మరణానికి యత్నించడంతో బండి కిష్టయ్యను వెంటనే ములుగు మండలంలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ రాకుంటే సిద్దిపేట ఇంత అభివృద్ధి జరిగేది కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో ఈరోజు (ఆదివారం) మాజీ ఎంపీపీ సరస్వతి విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం దారుణమంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
సిద్దిపేట జిల్లా: ఆషాడ బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరైనా మాజీలు కావాల్సిందేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిరాలను ఛిన్నాభిన్నం చేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు(Shishumandir Schools) నిలయాలని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ (Husnabad) సరస్వతీ శిశుమందిర్ పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.