Home » Sircilla
‘ఇన్నాళ్లకు సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా..? పదేళ్లు అధికారంలో కొనసాగిన మీరు ఎందుకు నేతన్నల సమస్యలు పరిష్కరించలేదు..? మీ హయాం నుంచి చేనేత కార్మికుల ఆకలి చావులు కొనసాగుతున్నది నిజం కాదా..?’’
కుల సంఘాలకు కార్యాలయాలు నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కుల సంఘాల తరఫున కల్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్ దర్శనం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
తెలంగాణలోని పది జిల్లాల్లో గర్భస్రావాల (అబార్షన్లు) శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణుల్లో 10 శాతం మందికి అబార్షన్లు అయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2,84,208 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు గురువారం రూ.35 లక్షల విరాళం అందజేసి మంచి మనసు చాటుకున్నారు.
‘‘పదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించి కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రపంచప్రఖ్యాత మ్యాగజైన్ ‘ది ఎకానమిస్ట్’ కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై బురద చల్లడం మాని ఇప్పటికైనా అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గుడి కట్టి కాంగ్రెస్ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ నేవూరి మమత-వెంకట్రెడ్డి
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అగ్రికల్చరల్ బ్యాంకు (టెస్కాబ్) చైర్మన్ పదవికి కొండూరి రవీందర్రావు రాజీనామా చేశారు. ఆయనతోపాటు వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. టెస్కాబ్లో చైర్మన్, వైస్ చైర్మన్ కలిపి తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రం.. మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి గద్దెనెక్కింది. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్తగా అలోచించి ఓటేయాలి.
Telangana: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.