Home » Social Media
మంత్రి సీతక్కను అవమానపరిచేలా, అసభ్యకరమైన పోస్టులు పెట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు నిందితలును సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన వర్రా రవీందర్ రెడ్డిని బుధవారం పొన్నూరు కోర్టులో హాజరుపరిచారు. అతడికి 14 రోజుల రిమాండ్ విధించిందీ కోర్టు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ శ్రేణులతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోకుండా తాము ఆదేశించలేమని హైకోర్టు పలువురు పిటిషనర్లకు సూచించింది.
దీక్షా దివస్ ... నవంబరు 29న బీఆర్ఎస్ జరుపుకునే దీక్షా దివస్ మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపుతిప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన రోజు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.
డబ్బులు తీసుకుని అవతలివారిపైసోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే కిరాయి మూకలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్టరీత్యా నేరమైన అంశాలను సోషల్ మీడియాలో ప్రచురించిన వ్యక్తులు.. చర్యల నుంచి ఎలాంటి మినహాయింపూ కోరలేరని స్పష్టం చేసింది.
ఇండియాలో త్వరలో సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించనున్నారా. అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటివల పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత చట్టాలను కఠినతరం చేయడంపై చర్చలు, ఏకాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేనికి విజయోత్సవాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతును నిండా ముంచినందుకా.. వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా.. ప్రభుత్వం గుడ్డి గుర్తులు, కాకి లెక్కలు, కల్లబొల్లి కబుర్లతో ఎల్లకాలం కాలం వెళ్లదీయలేదని.. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
గత వారం రోజులుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే భయాందోళనలో ఆయన ఉన్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా సాగుతుంది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. కూటమి పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యహారాన్ని కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
వైఎస్ జగన్ వీరాభిమాని, ఆ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిడుతూ.. తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనను నమ్మి మోసపోయానని, వ్యాపారంలో నష్టపోయి రోడ్డు పాలయ్యానని, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్‌ను బయట ఉంచి తప్పు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్త అన్నారు.