Home » Sonia Gandhi
పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర కాంగ్రెస్ (Congress) హై కమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈరోజు(గురువారం) ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయింది. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాన కీలక అంశాలపై చర్చించారు.
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది.
Telangana: పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాగాంధీతో పాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు చున్నీలాల్ గారసియా, మదన్ రాథోడ్‌లు రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఎన్నికైనట్టు అసెంబ్లీ సెక్రటరీ మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు.
కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగబోనని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాయ్ బరేలి ప్రజలకు సోనియా గాంధీ బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పోటీ చేయనున్నారు.
Andhrapradesh: ‘‘యాత్ర 2’’ సినిమాలో సోనియా గాంధీ పాత్రపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఏఐసీసీ నెంబర్ నరహరిశెట్టి నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీపై బురద జల్లడాన్ని ఖండిస్తున్నామన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో బుధవారం ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు బయలుదేరారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రేపు (బుధవారం) రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కోసం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే రేపు జైపూర్ వెళ్లనున్నారు.