Home » Sports news
మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ మైదానంలో నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట కంటే, రిషబ్ పంత్ గాయం అభిమానులకు కలకలం రేపింది. పంత్ గాయం గురించి సాయి సుదర్శన్ అందించిన అప్డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
వచ్చే సమ్మర్ ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనుండగా, ఈ క్రీడా మహోత్సవానికి సంబందించి కీలక అప్డేట్ వచ్చింది. ఆటగాళ్ల ప్రదర్శనలు కాకుండా నిర్వహణ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఈసారి చర్చనీయాంశమవుతున్నాయి.
ఇంగ్లండ్ రివర్సైడ్ గ్రౌండ్లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళా జట్టును 13 పరుగుల తేడాతో ఓడించి భారత మహిళా జట్టు సత్తా చాటింది.
భారత్-ఇంగ్లండ్ మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న ఐదు టెస్టుల సిరీస్ మరింత ఉత్కంఠ రేపుతోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కీలక మార్పు చేసింది.
చెస్ ప్రపంచకప్‌నకు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగబోతోంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూలై 20, 2025న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కి సంబంధించిన అప్డేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు, కోట్లాది మందికి అభిమానం కూడా. ఇలాంటి ఆట కోసం చదువును సైతం పలువురు క్రికెటర్లు పక్కన పెట్టారు. ఎవరెవరు అలా చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇంగ్లాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఛాలెంజ్‌కు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకొని గర్వంగా నిలిచిన భారత్, వన్డే సిరీస్‌లో కూడా అదే దూకుడు కొనసాగించాలనే లక్ష్యంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియాపై ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 259 రన్స్ చేసింది.
లార్డ్స్ మైదానంలో ఉత్కంఠగా కొనసాగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారత్‌పై 22 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఈ విజయంతో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్‌తో ఒక్క ఓవర్లో ఇద్దరిని ఔట్ చేయగా.. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఉత్సాహంతో బాల్ రా మామా, బాగుంది రా మామా అంటూ తెలుగులోనే నీతీష్‌ను మెచ్చుకున్నాడు.