Home » Sports
అమెరికా పర్యటనలో(జులై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్టు” అమెరికా దేశం డాలస్లోనే అతి పెద్ద మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించారు.
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ జయంతి సందర్భంగా గురువారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు.
జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడనుంది. ఆ పదవి రోహన్ జైట్లీకి దక్కే అవకాశం ఉంది. రోహన్ జైట్లీ దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ 2036లో భారత్‌లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే ఆలోచన చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
Maharaja T20 Trophy: మహారాజా టీ20 ట్రోఫీలో బౌలర్ అభిషేక్ ప్రభాకర్ అదరగొట్టాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి తన టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ అద్భుత ప్రదర్శనతో గుర్బర్గ్ టీమ్ మహారాజా టీ20 ట్రోఫీలో 4 మ్యాచ్‌లు గెలిచింది.
హైదరాబాద్: నగరంలో ఆదివారం ఉదయం రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మారథాన్‌ను నగర సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు సాగే ఈ మారథాన్.. ఫిట్నెస్ అవగాహణ కోసం నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ (NMDC) మారథాన్-2024 బహుమతుల ప్రదాననోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దేశవాళి క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికారు. గత 13 ఏళ్ల పాటు టీమిండియాకు శిఖర్ ధావన్ ప్రాతినిధ్యం వహించాడు.
ఒలింపిక్స్, ఆసియన్, కామన్వెల్త్ గేమ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2025కు హైదరాబాద్‌ను వేదిక చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ టీ 20 ఉమెన్స్ వరల్డ్ కప్ వేదిక మారింది. బంగ్లాదేశ్‌లో టోర్నమెంట్ నిర్వహణకు వివిధ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో మంచి అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది. వేదిక కోసం శ్రీలంక, జింబాబ్వే పోటీ పడ్డాయి. ఐసీసీ పాలకవర్గం మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు మొగ్గు చూపించింది. యూఏఈలో నిర్వహిస్తామని ప్రకటన చేసింది.
రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలు పెంచి.. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సాధన కోసం ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. క్రీడలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది.