Home » Sports
విశాఖపట్నం వేదికగా ఇవాళ(శనివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య వేదికగా మూడో వన్డే జరగనుంది. 20 వన్డేల తర్వాత తొలిసారి భారత్ టాస్ గెలిచింది. టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన సహచర ప్లేయర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ తో పాటు బెంగాల్ జట్టులోని ఇతర సభ్యులకు హైదరాబాద్‌లోని తన రెస్టారెంట్‌లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ కు ధన్యవాదాలు తెలుపుతూ టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డును సృష్టించాడు. యాషెష్ 2025 సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో 63 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ పిప్ లో అత్యధిక స్కోర్ చేసిన ఆసీస్ ప్లేయర్ గా స్మిత్ నిలిచాడు.
ఆసియా క్రీడల బంగారు పతకం విజేత, స్టార్ డిస్కస్ త్రో అథ్లెట్ సీమా పునియా(Seema Punia)కు బిగ్ షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో ఆమెపై 16 నెలల నిషేధం విధిస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల పునియాపై సస్పెన్షన్ నవంబర్ 10 నుంచే అమల్లోకి వచ్చినట్లు తాజాగా వెల్లడించింది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు విశాఖ స్టేడియం సర్వం సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ కీలకంగా మారింది.
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమానాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ముక్కోణపు సిరీస్‌లో అంపైర్లతో వాగ్వాదం కారణంగా.. అతడి ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలిసారిగా ఇన్‌స్టా పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో ఆమె వేలికి ఉంగరం లేకపోవడం చర్చకు దారి తీసింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్‌ను వదిలి సీఎస్కే నుంచి జడేజాను జట్టులోకి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్ఆర్ కెప్టెన్ ఎవరనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ విషయంపై మాట్లాడాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు టీమిండియా స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ నామినేట్ అయింది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షఫాలీ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
కటక్ వేదికగా డిసెంబర్ 9 నుంచి టీమిండియా-సౌతాఫ్రికా జట్లు ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు టికెట్ల కోసం కౌంటర్ల దగ్గర ఎగబడ్డారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ చాలా తక్కువ టికెట్లు మాత్రమే విక్రయానికి ఉంచిందనే ఆరోపణలు వస్తున్నాయి.