Home » Sri Satyasai
ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదికకు పలుశాఖల అధికారులు డుమ్మాకొడుతున్నారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ కార్యాలయంలో గ్రీవెన్సను నిర్వహించారు. మండలంలోని గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి ఆయాశాఖల అధికారులు ఉంటారన్న నమ్మకంతో ఎన్నో కష్టాలను ఓర్చుకుని కార్యాలయానికి వస్తున్నారు.
విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పులివెందుల జేఎన్టీయూ మెకానికల్ విభాగాధిపతి వేణుగోపాల్రెడ్డి సూచించారు. మండలంలోని హంపాపురం సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం మొద టి సంవత్సరం విద్యార్థుల కోసం ఓరియెంటేషన డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వేణుగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు.
మండలంలోని వెంకటాపురం, కొత్తగేరి, ముత్యాలంపల్లి గ్రామాలలో మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమాన్ని టీడీపీనాయకులు, అధికారులు సోమవారం నిర్వహించారు.
ఉమ్మడి అనంతజిల్లాలో పేదలకు అనేక సేవలు అందిస్తున్న ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని ఆర్డీటీ అభిమాన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్ర్తీశక్తి పథకాన్ని అమలు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని న్యామద్దల గ్రామంలో డ్వాక్రామహిళలు, టీడీపీ నాయకులు సోమవారం సంబరాలు నిర్వహించారు.
ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అడిషనల్ సెక్రటరీ, ఐఏఎస్ అనిల్ కుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
Terrorist Noor Case: నూర్ ధర్మవరం పట్టణం లోనకోటలో ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని కోరుతూ మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు బుధవారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
Newly Married Woman: నవ దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఏమైందో ఏమో తెలీదు కానీ, హర్హిత దారుణమైన నిర్ణయం తీసుకుంది.
Puttaparthi Theft Incident: ఒకేసారి 10 ఇండ్లలో చోరీ జరగడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కైన పరిస్థితి. అయితే దుండగులు చోరీ చేసిన ప్రదేశంలో కలెక్టర్ బంగ్లా కూడా ఉండడం విశేషం.