Home » Subrahmanyam Jaishankar
గత ప్రభుత్వాల హయాంలో కొన్ని సైద్ధాంతిక కారణాల వల్ల దేశ ప్రయోజనాలను త్యాగం చేశారని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో భారత దేశం ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తోందని, అయితే దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని చెప్పారు.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి, ఆకలితో బాధపడుతూ, వీథిలో ఏకాకిగా గడుపుతున్న హైదరాబాద్ విద్యార్థిని సయేదా లులు మిన్హాజ్ జైదీ కి చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ అండగా నిలిచింది. వైద్య సహాయం అందజేయడంతోపాటు, భారత దేశానికి తిరిగి వెళ్లడానికి సహాయపడతామని తెలిపింది.
అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ భారత దేశానికి చెందిన అత్యున్నత స్థాయి నేతలను బెదిరిస్తున్నాడు. మరో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని వాంకోవర్‌లో జూన్‌లో ప్రత్యర్థి వర్గాల దాడిలో చనిపోగా, అందుకు భారతీయ నేతలే కారణమని ఆరోపిస్తున్నాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి చాలా అంశాల నాడి తెలుసునని, వాటిని ఆయన విధానాలు, పథకాలుగా మార్చుతారని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చెప్పారు.
సిక్కు ఉగ్రవాదులు భారత దేశ వ్యతిరేకతతో రెచ్చిపోతున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించడం వంటి దురాగతాలకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌కు నిప్పు పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది.
ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థలు భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద ఈ నెల 8న నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాసింది.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)ను కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు. ఆయనను తాను ఓ మిత్రునిగా, నైపుణ్యంగల, సమర్థుడైన విదేశాంగ మంత్రిగా భావిస్తానని చెప్పారు. లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయంపైగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించినపుడు జైశంకర్ స్పందనపై తనకు భిన్నాభిప్రాయం లేదని చెప్పారు.
భారత దేశానికి గౌరవం దక్కకపోతే తాను తలక్రిందులవుతానని, చాలా బాధపడతానని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) చెప్పారు. తనపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించేవారిని తాను పట్టించుకోనని, అయితే భారత దేశాన్ని గౌరవించకపోతే, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తే, తాను తీవ్ర ఆవేదనకు గురవుతానని చెప్పారు.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ఆదివారం ఓ దళితుని ఇంట్లో అల్పాహారం స్వీకరించారు.
మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ఖలిస్థాన్ మద్దతుదారులు సంబరంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన కెనడా ప్రభుత్వంపై భారత ప్రభుత్వం మండిపడింది.