Home » Summer
మండే ఎండలతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులకు బేగంపేట వాతావరణ శాఖ(IMD) చల్లటి కబురు చెప్పింది. మే 7, 8 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Hyderabad Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రుద్రంపేట సర్కిల్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకూ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో ..
గుంతకల్లు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని, ఆలూరుకు మించిన భారీ విజయాన్ని అందుకుంటానని టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు. - నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? ఎలా పరిష్కరిస్తారు..? జయరాం: ఎక్కడి సమస్యలను పరిష్కరించాలన్నా ...
వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.
ఇప్పటికే అధికమైన ఎండవేడితో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి మరో హాట్ న్యూస్. శనివారం అగ్నినక్షత్రం ప్రారంభం కానుంది. శనివారం నుండి మూడు రోజులపాటు పగటిపూట ఉష్ణోగ్రత(Temperature)లు అత్యధికంగా ఉంటాయని ప్రకటించిన వాతావరణ కేంద్రం.. 17 జిల్లాలకు ‘ఆరంజ్ అలెర్ట్’ జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి.
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ వేడిమికి తోడు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అత్యధికంగా 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
జిల్లాలో రికార్డుస్థాయిలో ఎండలు నమోదువుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. మే నెలలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని రేకులకుంట ఆచార్య ఎన్జీరంగా వ్యవసార పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి హెచ్చరించారు. వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మే నెలలో గత 20 ...
ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయే తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు(Heat Wave Alerts) జారీ చేసింది.
గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తాగునీరు లేక రోగులు అల్లాడుతున్నారు. వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలరోజుల నుంచి చుక్క నీరు అందుబాటులో లేదు. తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. రోగులు నీటిని బయట కొనాల్సి వస్తోంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో ప్లాంట్ ద్వారా మెడికల్, లేబర్ వార్డుల వద్ద తాగునీటి సౌకర్యం ...