Home » Supreme Court
బెయిలు షరతుల ప్రకారం, వారంలో రెండు సార్లు విచారణ కార్యాలయంలో ఆయన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది.
పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో-46పై వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కారుకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలు వింటామని తెలిపింది.
ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు...ఉపాధి కల్పించలేరా?’’ అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. రెండు వారాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణకు చెందిన విద్యార్థి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద చేయూతనివ్వాలని కోరుతూ దరఖాస్తు చేశాడు.
గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేయడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇది సుమారు 30 వేల మంది అభ్యర్థులకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది.
ఢిల్లీలో కాలుష్యం తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలను తగ్గించేందుకు అనుమతి ఇస్తూనే, తదుపరి పర్యవేక్షణ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు ఫిజికల్ విధానంలో మళ్లీ ప్రారంభించాలని తెలిపింది.
నగదు మోసం కేసులో బెయిలుపై విడుదలైన మరునాడే మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji)ని సుప్రీంకోర్టు నిలదీసింది. అసలు తమిళనాడులో ఏం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.