Home » Supreme Court
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగడుగునా అడ్డుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై బురద జల్లాలని ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది.
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు(supreme court) ఇటీవల ఇచ్చిన నిర్ణయానికి నిరసనగా నేడు (ఆగస్టు 21న) భారత్ బంద్కు(Bharat Bandh) ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అయితే స్కూల్స్, బ్యాంకులు బంద్ ఉంటాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్ఫోర్స్ (ఎన్టీఎ్ఫ)ను ఏర్పాటు చేసింది. కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన
కోల్ కతా వైద్యురాలి మృతి కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటోన్న వేధింపులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థలో లైంగిక హింస మూలాలు ఉన్నాయని పేర్కొంది. ఇందుకు అరుణా షాన్బాగ్ కేసు ఉదహరణ అని పేర్కొంది.
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ చేపట్టనుంది.
కోల్కతా హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై మంగళవారం