Home » Suryakumar Yadav
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్ అంటే టాస్ మాత్రమే వేయడం కాదు.. పరుగులు కూడా చేయాలని తెలిపాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఇది జట్టుకు మంచి సంకేతాలు కావని అన్నాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. వీరి ప్రదర్శనపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్టెన్ స్పందించాడు. వాళ్లు తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉన్నట్లు తెలిపాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శనలు చేస్తున్నాడు. గత 20 ఇన్నింగ్స్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అటు బ్యాటుతో, ఇటు బంతితో భారత్.. విఫలమైంది. జట్టు ఓటమిపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడాడు. ఓటమికి గల కారణాలను వివరించాడు.
టీ20 సిరీస్ గెలవడంపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ను కైవసం చేసుకున్నామని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో ఆడటం మెగా టోర్నీకి గొప్ప సన్నాహకంగా మారుతుందని సూర్య అన్నాడు.
బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి ప్లేయర్ గా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలపడింది.
ఆసియా కప్లో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు హారిస్ రవూఫ్పై ఐసీసీ రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, ఫర్హాన్లపై కూడా జరిమానాలు విధించారు.
భారత్తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు విరుచుపడిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తమ పరాజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.