Home » Suryapet
తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(సోమవారం) సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.
2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
తన తండ్రిపై దాడిని తట్టుకోలేక బాలిక కుప్పకూలిపోయిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. బాలిక మృతికి సంతాపం ప్రకటించారు. ‘నిజంగా హృదయవిదారకమే! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి...
నాగారం మండలం డి.కొత్తపల్లి(D.Kothapalli) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక ఓ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
భార్యను హత్య చేసి... తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లాడో ప్రబుద్ధుడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించగా, మెడపై ఉన్న గాట్లను గుర్తించి పోలీసులు ప్రశ్నించటంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ... అర్హులైన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ఆయా ప్రాంతాల రైతులు సోమవారం బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు.
రుణమాఫీపై స్పష్టత లేదని వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Jagdish Reddy) అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కానీ అది ఒక పెద్ద జోక్లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
రూ.25 వేల లంచం సొమ్ముతో సూర్యాపేట జిల్లా ఇన్చార్జి మత్స్యశాఖ అధికారి(డీఎ్ఫవో) రూపేందర్సింగ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపహాడ్లోని బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికకు చేసిన వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.